Abn logo
Jul 13 2020 @ 20:02PM

పైలట్, 19 మంది ఎమ్మెల్యేలు గైర్హాజర్

జైపూర్: రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.


పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, పైలట్‌తో పాటు సీఎల్‌పీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలలో వేద్ సోలంకి, రాకేష్ పారిక్, మురారీ లాల్ మీనా, జేఆర్ ఖటన, ఇంద్రజ్ గుర్జర్, గజేంద్ర సింగ్ షెకావత్, హరీష్ మీనా, దీపేంద్ర సింగ్ షెకావత్, బన్వర్ లాల్ శర్మ, గజరాజ్ ఖాటన, వి.ఓలా, హేమరామ్ చౌదరి, పీఆర్ మీనా, రమేష్ మీనా, విశ్వేంద్ర సింగ్, ముఖేష్ భకర్, సురేష్ మోదీ, వీరేంద్ర చౌదరి, అమర్ సింగ్ జాతవ్ ఉన్నారు. అయితే, వీరేంద్ర చౌదరి మాత్రం సాయంత్రం సమయంలో రాజస్థాన్ ఇన్‌చార్జి అవినాష్ పాండేను, పార్టీ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్‌లను కలుసుకున్నారు. కాగా, గెహ్లాట్ చెబుతున్నట్టు ఆయనకు మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేదని పైలట్ వర్గీయులు అంటున్నారు. పైలట్ బీజీపీలో చేరడం లేదని కూడా చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement