Abn logo
May 22 2020 @ 04:43AM

భౌతికదూరం తప్పనిసరి

చారకొండ, మే 21:  మండల పరిధిలోని శేరిఅప్పారెడ్డిపల్లి, గోకారం గ్రామాల్లో ఉపాధిహామీ పనులను, నర్సరీలను గురువారం ఎంపీడీఓ జయసుధ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు ఒకరికి బదులు మరొకరు వస్తే వారిపై కేసునమోదు చేస్తామని హెచ్చరించారు.   కూలీలు భౌతికదూరం పాటిస్తూ మాస్కులను ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు గోలి రంగారెడ్డి, మాధవి, పంచాయతీ కార్యదర్శులు శశిదర్‌, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement