Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 02:18AM

ఇతడే ఆ ధీర ఫొటో జర్నలిస్టు

కసబ్‌ను తొలుత కెమెరాలో బంధించిన డిసౌజా

విచారణకు కీలక ఆధారంగా ఫొటో


అది 2008 నవంబరు 27. తెల్లవారగానే మార్కెట్‌లో, ఇళ్లలో దినపత్రికలు వచ్చేశాయి. చేతిలో ఏకే-47 రైఫిల్‌, నల్ల టీషర్టు, కార్గో ప్యాంటు ధరించి, వీపు వెనకాల ఓ సంచితో ఉన్న ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ ఫొటో ఒకటి అన్ని పత్రికల్లో ప్రధానంగా కనిపించింది. ఆరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దినపత్రికల్లోనూ ఉగ్రవాది కసబ్‌ ఫొటో ఒక్కటే ప్రధాన అంశం. అంతకుముందు రోజు ముంబైలోని తాజ్‌ హోటల్‌, నారీమన్‌ పాయింట్‌ వద్ద ఒబెరాయ్‌ ట్రిడెంట్‌, లియోపోల్డ్‌ కెఫే, సీఎస్టీ-కామా ఆస్పత్రుల వద్ద ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే.


అంతటి నరమేధం జరుగుతున్నప్పుడు కసబ్‌ను తన కెమెరాలో బంధించిన ఆ ధీర ఫొటో జర్నలిస్టు సెబాస్టియన్‌ డిసౌజా.అప్పుడాయన ‘ముంబై మిర్రర్‌’ దినపత్రికలో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఉగ్రదాడులు జరుగుతున్న సమయంలో డిసౌజా తన ప్రాణాలకు తెగించి కసబ్‌ను ఫొటో తీశారు. ఆయన తీసిన ఆ ఫొటోయే విచారణలో కీలక ఆధారంగా ఉపయోగపడింది. 2002లో గుజరాత్‌లో అల్లర్లు సంభవిస్తున్నప్పుడూ చేతిలో కత్తి పట్టుకున్న ఓ వ్యక్తిని డిసౌజా తన కెమెరాలో బంధించారు.

Advertisement
Advertisement