Abn logo
Apr 6 2020 @ 21:39PM

చంద్రబాబు లేఖకు స్పందించిన ఫిలిప్పీన్స్‌ రాయబారి కార్యాలయం

అమరావతి: ఫిలిప్పీన్స్‌లో తెలుగు విద్యార్ధుల మృతిపై చంద్రబాబు రాసిన లేఖకు స్పందన వచ్చింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు విద్యార్ధుల మృతదేహాలను ఏపీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అనంతపురం విద్యార్ధులు ఫిలిప్పీన్స్‌లో మృతి చెందారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. చంద్రబాబు, జైశంకర్‌లను ట్యాగ్ చేస్తూ ఫిలిప్పీన్స్ ఎంబసీ స్పందించింది. 


కాగా ఫిలిప్పీన్స్‌లో మరణించిన ఆంధ్ర విద్యార్థి భౌతిక కాయాన్ని భారత్‌కు తీసుకురావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన కొందిగళ్ల పెద్దింటి వంశీ అనే విద్యార్థి ఫిలిప్పీన్స్‌లో ప్రమాదవశాత్తూ మరణించాడు.  ఎలాగైనా అతడి భౌతికకాయాన్ని దేశానికి తీసుకురండి. అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను’ అని చంద్రబాబునాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ‘వంశీ మరణించాడన్న వార్త తెలుసుకున్న అతడి కుంటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ అంశంపై మీరు ప్రత్యేకంగా దృష్టి సారించి వీలైనంత త్వరగా వంశీ దేహాన్ని తీసుకురండి. వంశీ కుటుంబ సభ్యుల తరపున నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను’ అంటూ చంద్రబాబు తన లేఖలో మంత్రి జయశంకర్‌ను కోరారు.



Advertisement
Advertisement
Advertisement