Abn logo
Sep 20 2021 @ 23:56PM

పీజీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఎచ్చెర్ల : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ, అనుబంధ కళాశాలల పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండో సెమిస్టర్‌, బీటెక్‌ రెండో సమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్టు పీజీ ఎగ్జామినర్‌ డీన్‌ బి.అడ్డయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి పీజీ, 24 నుంచి బీటెక్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వచ్చే నెల4వ తేది నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే పీజీ సైన్స్‌, బీటెక్‌ ప్రాక్టికల్స్‌ మాత్రం ఈనెల 28, 29, 30 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు. కాగా అంతకుముందు కు ఈ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ ప్రతినిధులు యోగి, రమేష్‌, సత్యనారాయణ తదితరులు వర్సిటీ రిజిస్ట్రా ర్‌ తమ్మినేని కామరాజుకు వినతిపత్రాన్ని అందజేశారు.