Abn logo
Jun 4 2020 @ 02:45AM

‘ఇండియా’ పేరు మార్పు వ్యాజ్యం

  • వినతిగా కేంద్రం స్వీకరించాలి: సుప్రీం


న్యూఢిల్లీ, జూన్‌ 3: ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్చాలంటూ దాఖలైన ఒక వ్యాజ్యాన్ని వినతిపత్రంగా స్వీకరించాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ వాసి ఒకరు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా లేదా ‘హిందుస్థాన్‌’గా మార్చాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ కోరారు. ఇలా పేరు మారిస్తే వలసవాద గతం నుంచి ఈ దేశ పౌరులు బయటపడతారని పిటిషనర్‌ పేర్కొన్నారు. సీజే బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది.   రాజ్యాంగంలోనే ఇండియా పేరును ‘భారత్‌’గా వ్యవహరించారని  ధర్మాసనం పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి తెలిపింది. 


Advertisement
Advertisement
Advertisement