Abn logo
Aug 7 2020 @ 02:15AM

జేఈఈ, నీట్‌ వాయిదాకు సుప్రీంలో వ్యాజ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 6: సెప్టెంబరులో నిర్వహించ తలపెట్టిన జేఈఈ (మెయిన్‌), నీట్‌-అండర్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలయ్యింది.  దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు కలిసి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. కొవిడ్‌  తీవ్రత తగ్గి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే ఈ పరీక్షలు నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. జేఈఈ(మెయిన్‌), నీట్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై 3న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement