Abn logo
Apr 22 2021 @ 00:51AM

పేరూరు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ విజేత పీ కొత్తపల్లి జట్టు

రామగిరి, ఏప్రిల్‌ 21: మండలంలోని పేరూరులో బు ధవారం జరిగిన పేరూరు ప్రీమియర్‌లీగ్‌ ్జ్జక్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌లో పీ కొత్తపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేతకు వైసీపీ నాయకులు తోపుదుర్తి చందు చేతులమీదుగా రూ.40వేలు బహుమతి ప్రదానం చేశారు. పేరూరుకు చెందిన దాసరి మో హనబాబు ఆధ్వర్యంలో నెలరోజులకు పైగా జరిగిన ఈ టోర్నీలో 77 జట్లు పాల్గొన్నాయి. ఇందు లో మండలంలోని పేరూరు కొత్తపల్లికి చెందిన జట్టు, కంబదూరు మండలం పాల్లూరు జట్టు పైనల్‌కు చేరాయి. ఫైనల్స్‌లో పీ కొత్తపల్లి జట్టు 20 ఓవర్లలో 150 పరుగులు సాధించగా పాల్లూరు జట్టు 131 పరుగులు చేసి ఓటమి పొందింది. మ్యాన ఆఫ్‌ ది సీరీస్‌గా పీ కొత్తపల్లి జట్టు అశోక్‌ ఎంపికకాగా, మ్యాన ఆఫ్‌ ది మ్యాచగా గంగా ఎంపికయ్యారు. గెలుపొందిన జట్టును పేరూరు, పీ కొత్తప ల్లిలో ఘనంగా ఊరేగించారు.

Advertisement
Advertisement
Advertisement