Abn logo
Jun 4 2020 @ 03:38AM

పేరూరు డ్యాం శిలాఫలకాలు ధ్వంసం

  • ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు
  • పోలీసుల నిర్లక్ష్యం వల్లే దురాగతాలు: పరిటాల సునీత


రామగిరి, జూన్‌ 3: అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరు అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుకు హంద్రీనీవా జలాలను తరలించే పనులకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను వైసీపీ కార్యకర్తలు మంగళవారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిని గుర్తించిన సమీపంలోని పెదయ్యగారికొట్టాలవాసులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్‌ ఘటనాస్థలికి చేరుకుని ధ్వంసం చేసిన శిలాఫలకాలను పరిశీలించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు జరిగిన సంఘటనపై ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలు ఖండించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement