కరీంనగర్: కారు, లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని పరకాల క్రాస్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. హుజురాబాద్‌కు చెందిన మనిదీప్(21) అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.