Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిన్ను తిడతాం గానీ... మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం?: పేర్ని నాని

అమరావతి: ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితుల దగ్గరకెళ్లి ఆయన సతీమణి గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. భువనేశ్వరిని తిట్టారంటూ బాధితుల దగ్గర ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. ఆమెను తాము ఏమీ అనలేదన్నారు. ‘నిన్ను తిడతాం గానీ... మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతామని’ అన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారన్నారు. సినిమా టిక్కెట్ల అంశంపై చిరంజీవి అభిప్రాయాన్ని చర్చిస్తామని, సీఎంతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement