Abn logo
Apr 6 2020 @ 05:40AM

రోడ్లన్నీ నిర్మానుష్యం

జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు 

భయంతో ఇల్లు కదలని ప్రజలు

చర్యలు చేపడుతున్న అధికారులు


ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌5: జిల్లాలో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమో దుకావడంతో జిల్లాయంత్రాంగంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఇల్లు కదలడం లేదు. కలెక్టర్‌ జిల్లాలో కర్ఫ్యూ సమయాన్ని మార్చివేశారు. గత 10 రోజులుగా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కర్ఫ్యూలో సడలింపు ఇచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకు నేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఢిల్లీలోని మర్కజ్‌లో మత ప్రా ర్థనలకు వెళ్లివచ్చిన వారు కరోనా బారిన పడడంతో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జనం బయటకు వెళ్లక పోవడంతో రోడ్లన్నీ నిర్మా నుష్యంగా మారాయి. 


స్వీయ నిర్బంధంలో గ్రామాలు

జైనథ్‌: కరోనావైరస్‌ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదే శాలను జైనథ్‌, బేల మండలాల్లోని ఆయాగ్రామీణ ప్రాంత ప్రజలు తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు జిల్లాలోని ఉట్నూర్‌, నేరడిగొండలో కరోనా పది కేసులు పాజిటివ్‌గా రావ డంతో జైనథ్‌, బేల మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు బయటికి రావాలంటే జంకుతున్నారు.


జిల్లాకేంద్రానికి దగ్గరలో ఉన్న జైనథ్‌, బేల మండలాల ప్రజలు తమకు ఈ వ్యాధి సోకవచ్చనే అభి ప్రాయంతో ఆదివారం ప్రజలు, ఇతర వాహనాలు పూర్తిగా రాకపోకలు లేక జైనథ్‌ మండలంలోని ఆయా గ్రామాల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. సీఐ కోట్నాక్‌ మల్లేష్‌ ఆధ్వర్యంలో జైనథ్‌, బేల, భీంపూర్‌ మండలాల ప్రజ లు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శనగపంట కొను గోలు జరుగుతాయో లేదోనని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. 


సిరికొండ: సిరికొండలో పోలీసులు, అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇటీవల మర్కజ్‌ వెళ్లివచ్చిన ఆదిలాబాద్‌ జిల్లావాసుల్లో కొందరికి కరోనావై రస్‌ పాజిటివ్‌ రావడంతో మండల ప్రజలను అప్రమత్తం చేశారు.  ఆదివా రం మండలకేంద్రంలో సర్పంచ్‌ నర్మదాపెంటన్న ప్రతీ వీధిలో రోడ్లపై, ము రికి కాల్వల్లో సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పే చేయించారు.

Advertisement
Advertisement