Abn logo
Oct 15 2020 @ 01:49AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పౌసుమిబసు ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 6395954956కు కాల్‌ చేస్తే, తగిన సహాయక చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కంట్రోల్‌ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, మునిసిపల్‌, విద్యుత్‌ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

Advertisement
Advertisement