Abn logo
May 21 2020 @ 22:36PM

లాక్‌డౌన్‌లో సడలింపులు.. జనంలో హుషారు..

లండన్: కరోనా మహమ్మారి దాదాపు మూడు నెలల నుంచి ప్రజలను వణికిస్తోంది. ఏ దేశానికాదేశం కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తూ వచ్చింది. దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ప్రభుత్వం లాక్‌డౌన్‌లో సడలింపులివ్వడంతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అమెరికా, ఇటలీ, థాయ్‌లాండ్, కజికిస్తాన్, గ్రీస్, యూకే తదితర దేశాలు ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతులిచ్చాయి. దీంతో ప్రజల్లో చాలా కాలం తరువాత హుషారు వచ్చింది. అనేక దేశాల్లో షాపింగ్ మాల్స్ కూడా తెరుచుకోవడంతో ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇంతకుముందులా ఎలా పడితే అలా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. షాపింగ్ మాల్స్‌తో పాటు రెస్టారెంట్లు, హోటళ్లలో శానిటైజర్లు కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ దుకాణాలను శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫేస్ మాస్క్ లేనిదే చాలా రెస్టారెంట్లు కస్టమర్లను అనుమతించడం లేదు. కొన్ని దేశాల్లో మెట్రో సర్వీసులు తెరుచుకున్నా ప్రజలు అంతంత మాత్రంగానే ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement