Abn logo
Aug 2 2021 @ 00:08AM

పెనుగొండ సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షురాలిగా పద్మావతి

పద్మావతి

పెనుగొండ, ఆగస్టు 1 : పెనుగొండ మండల సర్పంచ్‌ల సంఘం చాంబర్‌ అధ్యక్షురాలిగా ఇలపర్రు సర్పంచ్‌ దండు పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షురాలిగా పద్మావతిని ఎన్నుకు న్నారు.అనంతరం పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణశాఖా మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు సహకారంతో సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.