Abn logo
Sep 25 2020 @ 04:54AM

ఉమ్మడి రిజర్వేషన్ల జోలికి వస్తే సహించం

పెద్దకొత్తపల్లి, సెప్టెంబరు 24: ఏబీసీడీ వర్గీకరణ నెపంతో ఉమ్మడి రిజర్వేషన్ల జోలికి వస్తే సహించేది లేదని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు తగిలి వెంకటస్వామి హెచ్చరించారు. గురువారం పెద్దకొత్తపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపర్చిన రిజర్వేషన్లను సవరించే అధికారం కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. జిల్లా కార్యదర్శి గురాల బాలయ్య, విష్ణుమూర్తి, నర్సింహ్మ, బి.రామకృష్ణ, ఎం.నందకుమార్‌, బి.మల్లయ్య పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement