Abn logo
Oct 21 2021 @ 21:19PM

పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలి

సమావేశంలో మాట్లాడుతున్న పి పెంచలయ్య

కావలిటౌన్‌, అక్టోబరు21: నివాసముంటున్న పేదలంద రికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి పీ పెంచలయ్య పేర్కొన్నారు. గురువారం స్ధానిక సీపీఎం కార్యాలయంలో ప్రభుత్వ స్ధలాల్లో నివాసముంటున్న వారితో ఎస్‌ వెంకయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల సాధన పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ  పేదలందరికీ ఉచితంగా పట్టాలు ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నుకున్న కమిటీ కన్వీనర్‌ అమర్‌కుమార్‌, సభ్యులు సుబ్రహ్మణ్యం, బాష, షేక్‌ జానీబేగం, మల్లీశ్వరి, అపర్ణ, మస్తానమ్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.