Advertisement
Advertisement
Abn logo
Advertisement

శాంతించు అమ్మోరు తల్లీ !

గుడిపాల, డిసెంబరు 2: ‘చెరువు మొరవ పారితే మేకపోతును బలిస్తామని మొక్కుకుని మరిచిపోవడంవల్లే అమ్మవారికి కోపం వచ్చింది. భూమిలోపల నుంచి శబ్దాలు ఆందుకు సంకేతం’ అంటూ గుడిపాల మండలం కిలారిపల్లె ప్రజలు పొలోమంటూ పూజలకు దిగారు. ఒక మహిళ కలలోకి అమ్మ వచ్చి ఈ సంగతి చెప్పిందని ప్రచారం కూడా జరగడంతో అందరూ కలిసి మాట్లాడుకుని గురువారం ఓమేకను బలిచ్చారు.పొంగళ్లు పెట్టారు. ఇక జనా న్ని భయపెట్టి, నిద్ర లేకుండా చేస్తున్న శబ్దాలు రావని వారు నమ్ముతున్నారు. 

Advertisement
Advertisement