Abn logo
Aug 7 2020 @ 03:43AM

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు బెదిరింపులా?: పీడీఎఫ్‌

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, మాజీ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ను అసాంఘిక శక్తులు రోజుల తరబడి ఫోన్లో బెదిరించడం దారుణమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎ్‌స.లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.  పెన్షన్లు, జీతాలు వెంటనే ఇవ్వాలి ఏపీటీఎఫ్‌ జూలై నెలకు సంబంధించి చాలామంది ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఆగస్టు ఆరో తారీఖు దాటినా ఇంకా వారి ఖాతాల్లోకి జమకాకపోవడం శోచనీయమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement