Abn logo
Nov 1 2020 @ 03:24AM

10 మంది ఉత్తరప్రదేశ్‌ దొంగలపై పీడీ యాక్టు

జీడిమెట్ల: చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కిస్తున్న 10 మంది కరుడు కట్టిన ఉత్తరప్రదేశ్‌గ్యాంగ్‌పై సైబరాబాద్‌ పోలీసులు పీడీ యాక్టు పెట్టారు. పోలీ్‌సకమిషనర్‌ సజ్జనార్‌ జారీ చేసిన ఉత్తర్వులను జగద్గిరిగుట్ట పోలీసులు చర్లపల్లిజైలు అధికారులకు అందించారు. ఉత్తర ప్రదేశ్‌ బుద్ధన్‌ జిల్లా, అల్లాపూర్‌ తానా, కాకర్ల గ్రామానికి చెందిన షేక్‌ అహ్మద్‌ అలియాస్‌ గుడ్డు(38),  ఖాదర్‌చౌక్‌తానా, దానాపూర్‌ గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి బిజేందర్‌సింగ్‌(40), హాసీన్‌ మహ్మద్‌(51), మెహతబ్‌బాటి(45), జితేందర్‌సింగ్‌(25), హకీంసింగ్‌(35), రామ్‌కుమార్‌సింగ్‌ (27), హబీబూల్‌(39), ఆర్ఫాన్‌అలీఖాన్‌(49), రహమాన్‌ అలీ(22) లు నగరంలో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ జగద్గిరిగుట్టలోని అంబేడ్కర్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆగస్టు 28వతేదీన శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి వీరి నుంచి పెద్ద ఎత్తున తపంచాలు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో ఉన్న పదిమంది నేరస్తులపై పీడీయాక్టు నమోదు చేసినట్టు జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement