Abn logo
Aug 7 2020 @ 03:38AM

రాష్ట్రంలో పెత్తందారీ పాలన: సాకే

అనంతపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పెత్తందారీ పాలన సాగిస్తున్నారు. కరోనా ముసుగులో ప్రజావ్యతిరేక పనులు చేస్తూ.. లేని సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా జగన్‌ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై మాట్లాడేవారి గొంతునొక్కే విధంగా పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు’’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ మండిపడ్డారు.


జగన్‌, బీజేపీలకు అలవాటే: తులసిరెడ్డి

‘‘మాట తప్పడం... మడమ తిప్పడం సీఎం జగన్‌కి, బీజేపీకి బాగా ఆలవాటే’’ అని ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి, ఇతర వైసీపీ నేతలు రాజధాని తరలిపోదంటూ విస్పష్టంగా చేసిన ప్రకటనలను గుర్తు చేశారు. వారే నేడు రాజధాని తరలింపును సమర్థిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటూ బీజేపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement