Abn logo
Oct 15 2021 @ 00:05AM

డీఎస్‌ను కలిసిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

an style="color: rgb(255, 0, 0);">
నిజామాబాద్‌, అక్టోబరు 14:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుమారు అరగంటకుపైగా ఆయనతో మాట్లాడారు. ఆయన కొద్ది రోజుల క్రితం బాత్‌ రూంలో పడడంతో చేయి ఫ్రాక్చర్‌ అయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉండి డీఎస్‌ చికిత్స పొందుతున్నారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసానని రేవంత్‌రెడ్డి అనుచరులు చెబుతున్న పండగ ముందు ఆయనను కలవడం ఉమ్మడి జిల్లా పరిధిలో చర్చనీయాంశం అయింది. టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్‌ను రేవంత్‌రెడ్డి కలవడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో మళ్లి చర్చలు మొదలయ్యాయి. గత కొంతకాలంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో పాటు పార్టీని వీడిన నేతలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు. ప్రస్తుతం డీఎస్‌ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకునేందుకు వచ్చినట్లు డీఎస్‌ సన్నిహితులు తెలిపారు. కొద్దిసేపు రాజకీయాలపైన చర్చించినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం డీఎస్‌ తనయుడు మాజీమేయర్‌ సంజయ్‌ పీసీసీ అధ్యక్షుడిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డీఎస్‌ను రేవంత్‌రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.