Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఎందుకు?: పయ్యావుల కేశవ్

హైదరాబాద్: ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌తో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఒప్పందం గురించి తెలుసుకున్నానన్నారు. రైతుల కోసం విద్యుత్ కొనుగోలు చేయడం తప్పుపట్టడం లేదన్నారు. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు సోలార్ విద్యుత్ దొరుకుతోందని, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చానన్నారు. వినియోగదారులపై భారం పడకుండా కమిషన్ పనిచేయాలని సూచించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement