Abn logo
Jul 9 2020 @ 22:07PM

‘వెంకీమామ’ విమర్శలపై పాయల్ రాజ్‌పుత్ రియాక్షన్ ఇదే

పాయల్ రాజ్‌పుత్ ఈ మధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్న హీరోయిన్. ప్రస్తుతం ఆమె కొత్తగా ఏ సినిమాలో చేయకపోయినా, ఏదో ఒక సినిమాలో చేస్తుందంటూ వార్తలు రావడం, ఆమె ఖండించడం వంటివి రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె ‘పుష్ప’, ‘ఇండియన్ 2’ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. అలాగే సీనియర్ హీరోల చిత్రాలలో ఇకపై నటించదంట అనే వార్తలు కూడా ఆమెపై వచ్చాయి. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి చిత్రాలలో ఆమె నటించింది. అయితే ఇకపై సీనియర్ స్టార్ హీరోల చిత్రాలలో నటించడానికి ఆమె ఇష్టపడటం లేదనే వార్తలు వినిపించాయి. వాస్తవానికి ‘వెంకీమామ’లో ఆమె చేసిన పాత్రపై విమర్శకులు కూడా వచ్చాయి. ఆమె తన తాజా ఇంటర్వ్యూలో ‘వెంకీమామ’పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడింది.


ఆమె మాట్లాడుతూ..‘‘నిజమే. నా ఫ్యాన్స్ నన్ను ఆ పాత్రలో చూడలేకపోయారు. పెద్ద వయసు ఉన్న పాత్రలో నేను నటించడం వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే సోషల్ మీడియాలో కూడా నాకు అలాంటి పాత్రలు చేయవద్దు అంటూ రిక్వెస్ట్‌లు పెట్టారు. అయితే దీనిపై నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. అభిమానులు అలాంటి పాత్రలు చేయవద్దు అని కోరుతున్నారు కానీ.. నేను మాత్రం ఎప్పుడూ ఎవరితో నటించను అని మాత్రం చెప్పలేదు. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఏ హీరో చిత్రంలో చేయడానికైనా నేను రెడీ..’’ అని పాయల్ తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement