Abn logo
Jul 30 2021 @ 23:37PM

టీకా వేయించుకునే వారకి 100 డాలర్లు ఇవ్వండి.. రాష్ట్రాలకు బైడెన్ సూచన

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని కలవరపెడుతోంది. డెల్టా వేరియంట్ కారణంగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో.. వ్యాక్సినేషన్ రేటును పెంచడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాష్ట్రాలకు కీలక సూచన చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీకా తీసుకునే వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వచ్చిన వరకు సుమారు 100డాలర్ల వరకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7400) నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. నగదు అందించడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకునే వారికి నగదును ప్రోత్సాహకంగా అందించడం ద్వారా ఇప్పటికే టీకా తీసుకున్న వారికి అన్యాయం జరుగుతుందనే విషయం తనకు తెలుసన్నారు. అయితే మహమ్మారిని ఓడించడానికి నగదు ప్రోత్సహకాలు ఉపకరిస్తాయని విశ్వసిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. 


తాజా వార్తలుమరిన్ని...