Abn logo
Apr 6 2020 @ 13:09PM

ఆ సినిమా పవన్ చేయాల్సిందేనా?

మెగా హీరో సాయి తేజ్ కథానాయకుడిగా `ప్రస్థానం` డైరెక్టర్ దేవ కట్టా ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. నిజానికి పవన్‌ను దృష్టిలో పెట్టుకుని దేవ కట్టా ఈ కథ రాసుకున్నాడట. 


చాలా సంవత్సరాల కిందటే, `ప్రస్థానం` తర్వాత పవన్‌ను దేవ కట్టా కలిసి ఈ కథ వినిపించాడట. అయితే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో పవన్ అప్పట్లో ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేశాడట. వేరే సినిమాను డైరెక్ట్ చేయమని అడిగాడట. ఆ సినిమా చేయడానికి దేవ కట్టా ఇష్టపడలేదట. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయి `ప్రస్థానం` హిందీ రీమేక్‌ను దేవకట్టా పూర్తి చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌పై దృష్టి పెట్టిన దేవకట్టా అప్పుడు పవన్‌కు చెప్పిన కథతోనే ఇప్పుడు సాయితేజ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. రమ్యకృష్ణ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోందట. 


Advertisement
Advertisement
Advertisement