Abn logo
Mar 31 2020 @ 19:03PM

ఒక చేత్తో ఫైల్స్.. మరో చేత్తో లెదర్ బ్యాగ్.. ‘వకీల్‌సాబ్’ పోస్టర్ వైరల్

Kaakateeya

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ మధ్యన విడుదల చేసిన పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంతా ఇంతా సంచలనం సృష్టించలేదు. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులతో పాత రికార్డులను మొత్తం బద్ధలు కొట్టేసింది. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనున్నారు.


ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చేత్తో ఫైల్స్.. మరో చేత్తో లెదర్ బ్యాగ్ పట్టుకుని లాయర్‌గా కోర్టుకు వెళ్తున్న పవన్ కల్యాణ్ పోస్టర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పోస్టర్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ గుబురు గడ్డంతో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షమైన ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ క్లీన్ షేవ్‌తో ఉన్నారు. ఇది అధికారికంగా విడుదల చేసిందా? లేక ఫ్యాన్స్ తయారు చేసిన పోస్టరా అనే సందేహాలు  కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ పోస్టర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుండటం విశేషం. 


కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే విడుదల చేయాలని సన్నాహాలు చేశారు.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కరోనా లాక్ డౌన్‌తో ఆగిపోయింది. దీంతో ఈ చిత్రం విడుదల తేదీని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement