Jul 30 2021 @ 22:43PM

భీమ్లానాయక్‌కు జోడిగా

పవన్‌ కల్యాణ్‌, రానా కథానాయకులుగా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నిత్యామీనన్‌ నటించనున్నట్టు కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. నిత్యామీనన్‌ కథానాయికగా ఎంపికైనట్టు తాజాగా చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆమె పవన్‌ భార్యగా కనిపించనున్నారని సమాచారం. నిత్యామీనన్‌ ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సాగర్‌ కె. చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, మాటలు, తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. నిత్యామీనన్‌ ప్రస్తుతం తెలుగులో ‘గమనం’, ‘స్కైలాబ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.