Abn logo
Oct 27 2021 @ 14:38PM

డ్రగ్స్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు

అమరావతి: డ్రగ్స్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వరస ట్వీట్లు చేశారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని చెప్పారు. విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు. కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు. మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందన్నారు. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని పేర్కొన్నారు. అప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వస్తుందన్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని గుర్తుచేశారు. ఆ పని వదిలి.. ఇప్పుడు బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారని చెప్పారు. సీజ్ చేసిన దానికంటే.. రాష్ట్రం దాటిపోతున్న సరుకే ఎక్కువన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption