Abn logo
Jul 15 2020 @ 11:07AM

ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌... ప‌వ‌న్ కల్యాణ్ రికార్డ్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయకుల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక‌రు. రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు వ‌రుస సినిమాల్లో ‘వకీల్‌సాబ్‌’తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది అయ‌న అభిమానుల‌కు సంతోష‌క‌ర‌మైన వార్త అనే చెప్పాలి. దీంతో సోష‌ల్ మీడియా ఆయ‌న అభిమానుల హంగామాకు హ‌ద్దే లేదు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. నెల‌న్న‌ర‌కు పైగానే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్పుడే సంద‌డి మొద‌లెట్టేశారు. హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేశారు. దేశంలోనే ట్విట్ట‌ర్ ట్రెండింగ్ స్టార్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు రికార్డ్ క్రియేట్ చేసింది.  24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్స్ ట్వీట్స్ వ‌చ్చాయంటే అభిమానుల ఏ రేంజ్‌లో చేల‌రేగిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. 

Advertisement
Advertisement
Advertisement