Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో కాకరేపుతున్న పవన్ కల్యాణ్ పర్యటన.. అందుకే పోసానితో విమర్శలు..

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఏపీలో కాకరేపుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ విమర్శల దాడి కొనసాగిస్తున్న వేళ.. విజయవాడలో ఆయన పర్యటన రాజకీయ వేడి రగిలిస్తోంది. కొన్ని రోజులుగా పవన్ వర్సెస్ మంత్రులుగా వ్యవహారం మారింది. పవన్ దూకుడుపై ప్రభుత్వ పెద్దల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే పోసానితో విమర్శలు చేయిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు.


నాదేండ్ల మనోహర్, ఇతర సభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. మరికాసేపట్లో మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. స్టీల్ ఫ్లాంట్, అమరావతి, శ్రమదానం, బద్వేల్ ఉప ఎన్నిక, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై  చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. రెండు రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement