May 10 2021 @ 22:01PM

పవన్‌తో బండ్ల గణేష్ చిత్రం.. దర్శకుడు అతనేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఖచ్చితంగా చిత్రం ఉంటుందని నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. సోషల్ మీడియా వేదికగా చెబుతున్న విషయం తెలిసిందే. ‘బాస్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తా..’ అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ట్విట్టర్‌లో సమాధానమిస్తుంటాడు. ‘గబ్బర్‌సింగ్’ సినిమా తర్వాత గణేష్ కాస్తా.. బ్లాక్‌బస్టర్ గణేష్‌గా మారాడు. ‘మళ్లీ మా బాస్‌తో అలాంటి బ్లాక్‌బస్టర్ చిత్రమే చేస్తా’నని చెప్పడమే కాదు.. అల్రెడీ కాంబినేషన్ కూడా బండ్ల సెట్ చేశాడనేలా సినీ ఇండస్ట్రీలో తాజాగా వార్తలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఓ దర్శకుడిని బండ్ల లైన్‌లో పెట్టాడని, ఆ దర్శకుడు చెప్పిన కథ.. పవన్ కల్యాణ్‌కి కూడా నచ్చిందని, ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తవగానే.. ఈ సినిమా సంగతి చూద్దామని బండ్లకు పవన్ మాటిచ్చినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఇంతకీ బండ్ల గణేష్ లైన్‌లో పెట్టిన దర్శకుడు.. ఎవరని అనుకుంటున్నారా? రమేష్ వర్మ. అవును రమేష్ వర్మ దర్శకత్వంలో పవన్‌తో బండ్ల సినిమా చేయబోతున్నాడట. ఇంతకు ముందు కూడా పవన్‌తో రమేష్ వర్మ చిత్రం చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు బండ్ల కూడా యాడ్ అయ్యేసరికి.. ఏమో ఈ వార్తలో నిజం ఉన్నా ఉండవచ్చనేలా టాక్ నడుస్తుంది. మరి ఇవి రూమర్సా.. లేక నిజంగానే కాంబినేషన్ సెట్టయ్యిందా.. అనేది తెలియాలంటే.. బండ్ల గణేష్ క్లారిటీ ఇవ్వాల్సిందే. అప్పటి వరకు ఈ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది.