Abn logo
Oct 31 2020 @ 15:20PM

పవన్‌ ఎంట్రీ ఎప్పుడంటే..?

Kaakateeya

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. కోవిడ్‌ ప్రభావంగా ఆగిన ఈ చిత్రం ఈ మధ్య రీస్టార్ట్‌ అయ్యింది. అయితే ఈ షెడ్యూల్‌లో ఇప్పటి వరకు పవన్‌కల్యాణ్‌ పాల్గొనలేదు. అయితే తాజా సమాచారం మేరకు నవంబర్‌ 1 నుండి పవన్‌కల్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌'కు ఇది రీమేక్‌. అమితాబ్‌ చేసిన లాయర్‌ పాత్రను పవన్‌ చేస్తున్నారు. పవన్‌ తొలిసారి లాయర్‌ పాత్రలో నటిస్తుండగా నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్‌ ఆలోచనలు చేస్తున్నారట. 


Advertisement
Advertisement