Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 25 2021 @ 09:43AM

తమిళనాడు, పుదుచ్చేరిల్లో మరో 3గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు...imd warning

చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం ఉదయం విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పెరంబలూర్, అరియాలూర్, నమక్కల్, పుదుకొట్టాయ్, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తంజావూర్, తిరువరూర్, నాగపట్టణం, మైలాదుత్తురాయి జిల్లాలు, పుదుచ్చేరిలోని కరైకల్ జిల్లాలో రాగల 3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. 

వర్షం సందర్భంగా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 5రోజుల పాటు కోస్తా ఆంధ్రా, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.


Advertisement
Advertisement