Abn logo
Sep 24 2021 @ 23:11PM

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

పెంచికలపేట, సెప్టెంబరు 24: గ్రామాల్లో పరిశు భ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఎల్కపల్లి, చెడ్వాయి, మొట్లగూడ గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎల్కపల్లి గ్రామంలో పరి శుభ్రత లోపించడంపై అసహనం వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు, కంపోస్టు షెడ్ల నిర్వహణను పటి ష్టంగా చేపట్టాలన్నారు. అనంతరం చెడ్వాయి గ్రామంలో మెగా చిల్డ్రన్స్‌పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పార్కు కోసం పది ఎకరాల నుంచి అయిదు ఎకరాల స్థలం ఉండాలన్నారు. అలాగే త్వరగా నిర్మాణపనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏపీవో సతీష్‌, కార్యదర్శులు జావీద్‌, వెంక టేష్‌, నాయకులు శ్రీనివాస్‌, నానయ్య, బాపురావు, నాన్న పాల్గొన్నారు.