Abn logo
Sep 17 2021 @ 23:37PM

కౌంటింగ్‌ సిబ్బందికి అవగాహన సదస్సు

బుట్టాయగూడెంలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో రాజు

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 17: పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనున్నారు. జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజ న్‌లకు సంబంధించి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నోవా ఇంజనీరిం గ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడతారు. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన నాలుగు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 71 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ అభ్యర్థి మృతితో ఎన్నిక జరగలేదు. కౌంటింగ్‌ ఏర్పాట్లను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ రవికిరణ్‌ పరిశీలించారు.


బుట్టాయగూడెం: జడ్పీటీసీ, ఎంపీటీసీఓట్ల లెక్కింపుపై సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు ఎంపీడీవో ఎం.రాజు అవగాహన కల్పించారు. వెలుగు మీటింగ్‌ హాలులో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన సూచనలు ఇచ్చారు. 15 మంది సూపర్‌వైజర్లు, 45మంది అసిస్టెంట్లకు లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను వివరించారు. అనంతరం పోటీచేసిన అభ్యర్థులకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియమాకం, కొవిడ్‌ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తన ఛాంబర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ హాలులోకి వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లు కొవిడ్‌ నిబంధనలు పాటించ డమే కాకుండా రెండు డోస్‌ల టీకాలు వేయించుకుని ఉండాలని, వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ సమర్పించాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోనివారు కొవిడ్‌ నెగిటివ్‌ ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల లోపు ఎన్నికల అధికారికి ఈ పత్రాలను అందజేయాలని ఎంపీడీవో సూచించారు. కౌంటింగ్‌ హాలులో తప్పకుండా భౌతికదూరం పాటించాలన్నారు. మాస్కులు వేసుకో వాలని, శానిటైజర్‌ వాడాలన్నారు. కార్యక్రమాల్లో ఎంఎల్‌వో శాస్ర్తి, కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్ధులు పాల్గొన్నారు.