Abn logo
Sep 21 2020 @ 11:10AM

సుశాంత్‌తో నటించనని పరిణీతి చెప్పింది: అనురాగ్

Kaakateeya

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నటించడానికి హీరోయిన్ పరిణీతి చోప్రా అంగీకరించలేదని, టీవీ నటుడితో కలసి పనిచేయనని చెప్పిందని ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా వెల్లడించారు. 2014లో అనురాగ్ నిర్మించిన `హసీ తో ఫసీ` సినిమాలో సుశాంత్‌ను హీరోగా అనుకున్నారు. ఆ తర్వాత సుశాంత్‌ను తప్పించి సిద్ధార్థ్ మల్హోత్రాను తీసుకున్నారు. దీని గురించి ఇటీవల విమర్శలు వచ్చాయి. 


ఆ సినిమా నుంచి సుశాంత్‌ను తప్పించడానికి గల కారణాలను తాజాగా అనురాగ్ వెల్లడించారు. ``హసీ తో ఫసీ` సినిమాను సుశాంత్‌తో చేయాలనుకున్నాం. హీరోయిన్‌గా పరిణీతి చోప్రాను అనుకున్నాం. అయితే సుశాంత్ పేరు చెప్పగానే ఆమె అంగీకరించలేదు. `టీవీ నటుడితో కలిసి పనిచేయను` అని చెప్పేసింది. దాంతో సిద్ధార్థ్‌ను తీసుకున్నాం. అయితే సుశాంత్ కేవలం టీవీ నటుడు మాత్రమే కాదని, `పీకే`లో కూడా నటిస్తున్నాడని చెప్పాం. దాంతో ఆమె `శుద్ధీ దేశీ రొమాన్స్`లో సుశాంత్‌తో కలిసి నటించింద`ని అనురాగ్ వెల్లడించారు.  

Advertisement
Advertisement
Advertisement