Abn logo
Sep 27 2020 @ 00:57AM

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు.. పేదలపాలిట వరాలు

Kaakateeya

పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి


పరిగి(రూరల్‌) : రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి అన్నారు. పరిగిలో శనివారం ఎమ్మెల్యే ఎంపీపీ అరవింద్‌రావుతో కలసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. 80మంది లబ్ధిదారులకు రూ.80,09,280 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ భాస్కర్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, ఆర్‌.ఆంజనేయులు, రాజేందర్‌, వెంకటయ్య సర్పంచులు అశోక్‌రెడ్డి, ఆర్‌.శ్రీనివాస్‌, గణేష్‌ పాల్గొన్నారు.


చిరువ్యాపారులకు అండగా ఉంటా

పరిగిలో డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో బాగంగా డబ్బాలు కోల్పోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి హామీ ఇచ్చారు. పరిగి పట్టణంలోని మార్కెట్‌ యార్డులో శనివారం  చిరు వ్యాపారులు డబ్బాల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే స్థలాన్ని పరిశీలించారు. పరిగి మున్సిపాలిటీలో గాంధీచౌక్‌ నుంచి అంబేద్కర్‌  విగ్రహం వరకు డబుల్‌ బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా దుకాణాలు కోల్పోయిన వారికి స్థలం చూపుతామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, మునీర్‌ పాల్గొన్నారు.


ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించాలి

దోమ: ప్రభుత్వ కళాశాలల, పాఠశాలల్లో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. దోమ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన బ్యానర్‌, కరపత్రాన్ని శనివారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయాలని కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌, అధ్యాపకులు రాములు, లక్ష్మయ్య, మధుసూదన్‌, శ్రీధర్‌, సువర్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement