విజేతకు ట్రోఫీని అందజేస్తున్న బాలినేని ప్రణీత్‌రెడ్డి
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 17 : సంక్రాంతి పండు గను పురస్కరించుకుని ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదానంలో జరుగుతున్న బాలినేని వెంకటేశ్వరరెడ్డి, ర మాదేవి మెమోరియల్ ఇంటర్‌స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పర్చూరు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో పర్చూరు మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు నేతృత్వం వహించిన పర్చూరు జట్టు, చెన్నై జట్టు తల పడ్డాయి. ఉత్కంఠ పోరులో గెలిచిన పర్చూరు జట్టుకు వైసీపీ యువ నేత బాలినేని ప్రణిత్‌రెడ్డి మొదటి బహు మతిని రూ.లక్షను, ట్రోఫీని అందజేశారు. ద్వితీయ బ హుమతి చెన్నై జట్టుకు రూ.75వేలు, తృతీయ బహు మతి ఒంగోలు జట్టుకు రూ.50వేలు బహూకరించారు. కాగా అంతకుముందు టోర్నమెంట్ ప్రతినిధులు కాకు మాను సునీల్, పి.ఏడుకొండలు, ఎ.శ్రీనివాస్, షేక్ ము న్నా, షేక్ సాధిక్, సాయికృష్ణల ఆధ్వర్యంలో భారీ మో టార్సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆ మంచి స్వాములు, నగర అధ్యక్షుడు సింగరాజు వెంక ట్రావు, సయ్యద్జలీల్ తదితరులు పాల్గొన్నారు.