Abn logo
Jun 3 2020 @ 20:31PM

సీనీ కార్మికుల కు అండగా నిలబడిన ‘పరారి’ టీమ్

కరోనా విపత్కర కాలంలో సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులకు తమ వంతు సాయం అందించేందుకు ‘పరారి’ చిత్ర బృదం ముందుకు వచ్చింది.  ‘పరారి’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న యోగీశ్వర్ 24 శాఖలకు సంబంధించిన వర్కర్స్‌కు నిత్యావసరాల పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో నిర్మాత గిరి, హీరో యోగీశ్వర్ , నటుడు శ్రవణ్  తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ ‘‘కరోనా అనేది ఎవరూ ఊహించని విపత్తు అందరూ సేఫ్‌గా ఉండాలి. కార్మికుల‌కు ప్రోత్సాహంతో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాం.. త్వరలో షూటింగ్స్ ప్రారంభం అవుతాయి’’ అన్నారు. నిర్మాత గిరి  మాట్లాడుత ‘‘సుమన్‌గారిపై అభిమానంతో నిర్మాతగా మారాను. కరోనా వల్ల ఇబ్బందుల పడుతున్న కార్మికుల కోసం నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాం. దాదాపు 250 కార్మికులకు పైగా సరకులను అందించాం’’ అన్నారు. నటుడు అమిత్ మాట్లాడుతూ ‘‘' సినీ కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమిది’’ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement