Abn logo

పనీర్‌ లడ్డు

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 2 లీటర్లు, నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - అర టీ స్పూను, పాలు - పావుకప్పు (విడిగా)-  క్రీమ్‌-పావు కప్పు, మిల్క్‌పౌడర్‌-ముప్పావు కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌-ముప్పావు కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను. 

తయారుచేసే విధానం: లోతైన పాత్రలో పాలను మరిగించి నిమ్మరసం కలపాలి. పాలు పూర్తిగా విరిగిన తర్వాత వడకట్టి పక్కనుంచాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి పాలు పోయాలి. ఆ తర్వాత క్రీమ్‌ వేసి బాగా కలపాలి. ఆనక మిల్క్‌పౌడర్‌ వేసి ఉండలు చుట్టకుండా తిప్పుతూ, కోవా చిక్కబడ్డాక చిదిమిన పనీర్‌ వేసి చిన్నమంటపై 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మీడియం మంటలో అడుగంటకుండా కలపాలి. పూర్తిగా చిక్కబడ్డాక యాలకుల పొడి కలిపి దించాలి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి.

షోర్‌ భాజామావా కోకొనట్‌ రోల్‌కడాకనీసగ్గుబియ్యం పాయసం (వీడియో)రసగుల్లరవ్వ అప్పాలుబెల్లం అన్నంకొబ్బరి తీపి కుడుములుబాసుందిమ్యాంగో పనీర్‌ రోల్స్‌
Advertisement
Advertisement