Advertisement
Advertisement
Abn logo
Advertisement

పనీర్‌ గార్లిక్‌ సాస్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌- 250 గ్రాములు, ఉల్లి ముక్కలు - కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, పచ్చి మిర్చి ముక్కలు- స్పూను, ఉల్లికాడ ముక్కలు- పావు కప్పు మిరియాల పొడి- స్పూను, వరి పిండి- స్పూను, సోయ సాస్‌- అర స్పూను, కెచప్‌ - అర స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: మొదట వేడి నీళ్లలో పనీర్‌ ముక్కల్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కల్ని వేయించాలి. వెల్లుల్లి, మిర్చి ముక్కల్ని జతచేయాలి. వరి పిండినీ వేసి కలపాలి. ఆ తరవాత నాలుగు కప్పుల నీటిని చేర్చాలి. సోయా సాస్‌, కెచప్‌, మిరియాల పొడి కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. కాస్త చిక్కబడ్డాక పనీర్‌ ముక్కల్ని వేసి నిమిషం పాటు అలాగే ఉంచి పొయ్యి కట్టేయాలి. ఉల్లికాడల ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు పైన చల్లితే పనీర్‌ గార్లిక్‌ సాస్‌ రెడీ. 

మకర చౌలా మినప్పప్పు కచోరీ దహీ కే కబాబ్‌ఆమ్లా జాట్జికివెజ్‌ జాల్‌ఫ్రెజీపనీర్‌ దోశక్యారెట్‌ పొరియల్‌డయాబెటిస్‌ను నియంత్రించే ములక్కాడల కూరఆలూ బ్రెడ్‌ రోల్స్‌పెసరపప్పు పకోడా
Advertisement