Abn logo
Oct 21 2021 @ 21:27PM

పాలన చూసి ఓర్వలేకనే దూషణలు

21యుడిజిఆర్‌1: దీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాలన చూసి ఓర్వలేకనే దూషణలు -ఎమ్మెల్యే మేకపాటి ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 21: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన సాగిస్తుండడంతో అది చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం స్థానిక పంచాయతీ బస్టాండ్‌సెంటర్‌లో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు చంద్రబాబు పట్టాభిలాంటి నేతలచే సీఎంను దుర్భాషలా డించడం చూసి ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కుట్రదారుడు, వెన్నుపోటు దారుడైన చంద్రబాబు ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్లు అక్కి భాస్కర్‌రెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, ఆండ్రా బాలగురవా రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ గాజుల తాజుద్దీన్‌, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

  -ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 21: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన సాగిస్తుండడంతో అది చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం స్థానిక పంచాయతీ బస్టాండ్‌సెంటర్‌లో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు చంద్రబాబు పట్టాభిలాంటి నేతలచే సీఎంను దుర్భాషలా డించడం చూసి ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కుట్రదారుడు, వెన్నుపోటు దారుడైన చంద్రబాబు ఎన్ని దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు.  ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్లు అక్కి భాస్కర్‌రెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, ఆండ్రా బాలగురవా రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ గాజుల తాజుద్దీన్‌, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,  తదితరులు పాల్గొన్నారు.