Abn logo
Jul 13 2020 @ 14:58PM

పాకిస్థాన్‌లో 2.50లక్షలు దాటిన కరోనా కేసులు..!

లాహోర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. పాకిస్థాన్‌లోనూ మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో పాకిస్థాన్‌లో2,769 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాక్‌లో కొవిడ్-19 బాధితుల సంఖ్య 2.50లక్షలకు చేరింది. నిన్న ఒక్కరోజే 69 మంది కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్థాన్‌లో కరోనా మృతుల సంఖ్య 5,226కు చేరింది. కరోనా బారిన పడిన వారిలో దాదాపు 1800 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా.. పాక్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే అత్యధికంగా లక్షకు పైగా కొవిడ్ కేసులు సంభవించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు దాదాపు 1.61లక్షల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు పాక్ పేర్కొంది. 


Advertisement
Advertisement
Advertisement