Abn logo
Mar 31 2020 @ 18:25PM

పాక్ ప్రధానికి భారీ షాక్! మోదీ ప్రస్తావన తెచ్చినందుకు..

ఇస్లామాబాద్: కరోనా ధాటికి పాకిస్థాన్‌ అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో పాక్‌లోని అనేక రాష్ట్రాలు.. భారత్ తరహాలో దేశాన్ని లాక్ డౌన్ చేయాలనే యోచనలో ఉన్నాయి. ఈ యోచనను పాక్‌ మీడియా కూడా సమర్థిస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దీన్ని సుతరామూ ఒప్పుకోవట్లేదు. పాక్ ఆర్థికస్థితి అందుకు సహకరించదని తొలి నుంచీ ఆయన చెబుతూ వస్తున్నారు.


అయితే ఇమ్రాన్ తన ప్రయత్నాలను అక్కడితో సరిపెడితే బాగుండేది. కానీ దీనికి బదులుగా.. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన తెచ్చారు. అదిగో..చూడండి.. అనాలోచితంగా లాక్ డౌన్ చేసినందుకు మోదీ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పారు అంటూ.. మోదీ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడే ఆయన దెబ్బైపోయారు. అసలు విషయం తెలుసుకున్న ప్రధాన మీడియా.. మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారా అంటూ ఇమ్రాన్ ఖాన్‌పై దుమ్మెత్తిపోసింది. లాక్ డౌన్ చేసినందుకు మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదని..దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు మాత్రమే క్షమాపణలు చెప్పారని ఆధారాలతో సహా చూపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ చేయకతప్పట్లేదు అన్న మోదీ వ్యాఖ్యలను దాచిపెడితే ఎలా అంటూ ఖాన్‌ సాబ్‌తో కబడ్డీ ఆడుకుంది.  

Advertisement
Advertisement
Advertisement