Abn logo
Oct 25 2020 @ 17:03PM

‘పాక్ తనతో తానే యుద్ధం చేస్తోంది’

Kaakateeya

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాలంటూ అక్కడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యమిస్తున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై సైన్యం అజమాయిషీ చెలాయించడాన్ని కూడా అవి అక్షేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఉద్యమకారుడు అమ్జద్ అయూబ్ మిర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ తనతో తానే యుద్ధం చేస్తోందని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ‘మూడు రోజుల క్రితం సింధ్ ప్రాంతపు ఐజీ అపహరణకు గురయ్యారు. నిన్న రాత్రి అలీ ఇమ్రాన్‌ను అపహరించారు. నేడు ఎమ్ఎన్ఏ మొహషీన్ దవార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాక్ తనతో తానే యుద్ధం చేస్తోంది’ అని ఆయన ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. కెట్టాలో ప్రతిపక్షాలన్నీ ధర్నా చేస్తుండగా.. అందులో పాల్గొనేందుకు పీటీఎమ్ నేత మోహ్షీన్ దవార్ కెట్టాకు వెళ్లారు. అయితే..అక్కడి పోలీసులు దవార్‌ను ఎయిర్ పోర్టులోనే నిలిపివేసి ర్యాలీలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. దీనిపై ప్రస్తుతం పాక్‌లోని ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement