Abn logo
Aug 3 2021 @ 22:39PM

సార్వా.. విపత్తు!

వీరవాసరం రైతు భరోసా కేంద్రం

రైతాంగానికి అందని విత్తనాలు



వీరవాసరం, ఆగస్టు 3 : రైతు భరోసా కేంద్రాలు రైతులకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో లేవు.నిన్న మొ న్నటి వరకూ దాళ్వా పంట విక్రయించడానికి రైతు లు ఆర్‌బీకేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఇప్పటికీ సార్వా పెట్టుబడులకు అమ్మిన ధాన్యం సొమ్మురాని పరిస్థితి ఎందరిదో. ఇటీవల అధిక వర్షాలు నారుమడులను దెబ్బతీశాయి. మొదటి విడత వేసిన విత్తనం ఒకసారి వర్షాలకు నష్టపోగా , రెండోసారి వేసి తిరిగి కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులు ఎందరో ఉన్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులు నారుకు, విత్తనానికి ఇప్పటికీ వెతుకులాడుతూనే ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం అందుతుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. సబ్సిడీపై ఇచ్చే విత్తనాలే లేవు.  అయినా ఆర్‌బీకేల ద్వారా 1161 విత్తన రకాన్ని రైతులకు అందజేస్తున్నారు. దీని కాల పరిమితి అధికం కావడం వల్ల సార్వా మరింత జాప్యమవుతోందని రైతులు వాపోతున్నారు. మరో పక్క 1064 విత్తనానికి వెతుకుతూనే ఉన్నారు. ఇది రైతులకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌బీకేల అధికారుల నుంచి ఎటువంటి సూచనలు, సలహాలు కూడా అందడం లేదని వాపోతున్నారు.