Abn logo
Jun 3 2020 @ 03:41AM

పేసర్‌ షమి ఉదారత

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుతున్న వలస కార్మికులకు భారత పేసర్‌ మహ్మద్‌ షమి తన వంతు సాయం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌లో తన ఇంటి వద్ద షమి ప్రతి రోజూ వలస కార్మికులకు ఆహారం, నీళ్ల బాటిళ్లు అందజేస్తున్నాడు. యూపీలోని జాతీయ రహదారి నెంబర్‌ 24పై ఆహార పంపిణీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. వలస కార్మికుల కోసం ఢిల్లీ-ముంబై మఽధ్య మూడు విమానాలను ఏర్పాటు చేయనున్నట్టు షమి తెలిపాడు.

Advertisement
Advertisement
Advertisement