Abn logo
May 23 2020 @ 19:59PM

ఆర్బీఐ నగదు లభ్యతను ఎందుకు పెంచుతోంది : చిదంబరం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు నెగెటివ్ వైపు వెళ్తున్నపుడు మరింత నగదుతో ఎందుకు నింపుతున్నారని నిలదీశారు. 


చిదంబరం శనివారం ఇచ్చిన ట్వీట్లలో కేంద్ర ప్రభుత్వంపైనా, భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌పైనా మండిపడ్డారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు నెగెటివ్ వైపు వెళ్తున్నట్లు. డిమాండ్ కుప్పకూలినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్తున్నారని, అలాంటపుడు నగదు లభ్యతను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. 


‘‘మీ కర్తవ్యం మీరు చేయండి, ద్రవ్య సంబంధిత చర్యలు తీసుకోండి’’ అని శక్తికాంత దాస్ ప్రభుత్వానికి కఠినంగా చెప్పాలని చిదంబరం అన్నారు. 


జీడీపీలో 1 శాతం కన్నా తక్కువ ద్రవ్య ప్రోత్సాహకంతో కూడిన ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆర్బీఐ ప్రకటన తర్వాత సైతం,   తమను తాము పొగుడుకుంటారా? అని అడిగారు.


ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నెగెటివ్ గ్రోత్ టెరిటరీకి దిగజార్చినందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సిగ్గుపడాలన్నారు. 


ఆర్బీఐ శుక్రవారం చేసిన ప్రకటనలో దేశం 40 ఏళ్ళలో తొలిసారి ఆర్థికంగా  బలహీనపడుతున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 దేశానికి పెను ముప్పు తీసుకొచ్చిందని తెలిపింది.


Advertisement
Advertisement
Advertisement