Abn logo
May 28 2020 @ 03:35AM

సీఎం క్యాంపు ఆఫీస్‌ వద్ద.. బ్రిడ్జి మరమ్మతులకు 1.85 కోట్లు

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో బంకింగ్‌హమ్‌ కెనాల్‌పై ఉన్న వంతెన (హెచ్‌ఎల్‌బీ), దాని అనుబంధ రహదారి మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.85 కోట్లు విడదల చేశారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బంకింగ్‌హమ్‌ కెనాల్‌పై హైలెవల్‌ బ్రిడ్జి, దానికి అప్రోచ్‌ రోడ్డు ఉంది. దీనికి సమీపంలోనే సీఎం కోసం ఓ హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. హైలెవల్‌ బ్రిడ్జి నుంచి అప్రోచ్‌రోడ్డు ద్వారా హెలిప్యాడ్‌కు వెళ్లాలంటే ఇరుకుగా ఉందని ఆర్‌అండ్‌బీ గుర్తించింది. అత్యవసర మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.


Advertisement
Advertisement
Advertisement